
మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లు షురూ
వరంగల్: వరంగల్ వ్యవసాయ మార్కెట్ అధికారులు బుధవారం కొత్త పత్తి కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు. బహిరంగ వేలం నిర్వహించగా క్వింటాల్‌కు గరిష్ట ధర రూ.7,191 పలికింది. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం అనంతసాగర్‌కు చెందిన రైతు టి.నరేశ్ 10 బస్తాల పత్తిని తీసుకొచ్చాడు. 28 శాతం తేమ ఉండడంతో క్వింటాలుకు రూ.7,191 ధరతో అరవింద్ ట్రేడర్ ద్వారా లక్ష్మీప్రద ట్రేడర్స్ కొనుగోలు చేసినట్లు మార్కెట్ గ్రేడ్ 2 కార్యదర్శి ఎస్.రాము తెలిపారు. సుమారు 3వేల బస్తాలు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో చాంబర్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు కటకం పెంటయ్య, కాటన్ అసోసియేషన్ అధ్యక్షుడు చింతలపల్లి వీరారావు, సాగర్ల శ్రీనివాస్, మార్కెట్ అధికారులు అంజిత్‌రావు, రాజేందర్, స్వప్న, సలీం తదితరులు పాల్గొన్నారు.
సీసీఐ కొనుగోలు చేస్తేనే రైతులకు లాభం..
పత్తిని సీసీఐ కొనుగోలు చేస్తే అదనంగా ధర పలికి రైతులు ఆదాయం పొందుతారు. పత్తి కొనుగోళ్ల ప్రక్రియలో సీసీఐ కఠిన నిబంధనలు పెట్టడంతో జిన్నింగ్ మిల్లల యజమానులు టెండర్లు దాఖలు చేయలేదు. దీనివల్ల అధికారులు బహిరంగ వేలంతో మార్కెట్‌లో కొత్త పత్తిని కొనుగోలు చేస్తున్నారు. సీసీఐ రంగంలోకి వస్తే గరిష్ట మద్దతు ధర రూ.8,110 ఉండి క్వింటాల్‌కు రూ.500 అధికంగా గిట్టుబాటు అయ్యే అవకాశాలున్నట్లు రైతులు అంటున్నారు. నిబంధనలపై మిల్లర్లతో చర్చలు జరిపి సీసీఐ కొనుగోళ్లు చేపట్టాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
క్వింటాల్‌కు గరిష్ట ధర రూ.7,191
తొలి రోజు 3వేల బస్తాల రాక