
జేఎన్‌ఎస్‌లో బాక్సింగ్ ఎంపికలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని డీఎస్‌ఏ బాక్సింగ్ హాల్‌లో బుధవారం ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అండర్–17 బాలబాలికల బాక్సింగ్ ఎంపిక పోటీలు నిర్వహించారు. హనుమకొండ డీవైఎస్‌ఓ గుగులోత్ అశోక్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ఎంపిక పోటీలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. జిల్లా నలుమూలల నుంచి 150 మంది బాలబాలికలు హాజరైనట్లు ఎస్‌జీఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వెలిశెట్టి ప్రశాంత్ తెలిపారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు హనుమకొండలో జరుగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. అండర్–17 బాలబాలికల కన్వీనర్ శీలం పార్ధసారథి, భూపాలపల్లి డీవైఎస్‌ఓ రఘు, పీఈటీల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భోగి సుధాకర్, ఒలింపిక్స్ సంఘం జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి మంచాల స్వామిచరణ్, పీడీలు సుభాశ్‌కుమార్, సురేశ్, ప్రేమ్, నాగరాజు, బాక్సింగ్ కోచ్‌లు దేవరకొండ ప్రభుదాస్, సందెల శ్యాంసన్, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.
విద్యుదాఘాతంతో
యువకుడి మృతి
గోవిందరావుపేట : విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈఘటన బుధవారం మండలంలోని పస్రాలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. పస్రాలో నిర్మిస్తున్న రైస్ మిల్లు పనుల్లో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌కు బహుగూడ యాదవ్ (20) వెల్డింగ్ చేస్తున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. సహకార్మికులు స్పందించి వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.