
బీఆర్‌ఎస్ పాలనలోనే అభివృద్ధి
పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్
హన్మకొండ: బీఆర్‌ఎస్ పాలనలోనే అభివృద్ధి జరిగిందని పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భద్రకాళి అమ్మవారికి కేసీఆర్ బంగారు కిరీటం చేయిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం భద్రకాళి చెరువు మట్టిని అమ్ముకుని అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, నాయకులు మర్రి యాదవరెడ్డి, తాళ్లపల్లి జనార్దన్‌గౌడ్, రమేష్, పులి రజనీకాంత్ పాల్గొన్నారు.
వినయ్‌భాస్కర్‌కు పోలీసుల నోటీసులు..
దాస్యం వినయ్‌భాస్కర్‌కు పోలీసులు నోటీసులు అందించారు. రైతులకు యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ చౌరస్తాలో గత నెలలో బీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి వినయ్‌భాస్కర్ ధర్నా చేశారు. కాగా, ధర్నా చేసిన వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో హనుమకొండ ఎస్సై సదానందం నోటీసులు అందించారు.