
ఓట్లను అపహరించిన బీజేపీ, బీఆర్‌ఎస్
ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
కాజీపేట రూరల్: బీజేపీ, బీఆర్‌ఎస్ గతంలో ఓట్లను అపహరించాయని, శాసనసభ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల వ్యత్యాసం ఉందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, ఆరోపించారు. ఓటు చోరీపై కాజీపేటలో మంగళవారం సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా వారు హాజరై మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈసీతో కలిసి ఓట్లను చోరీ చేస్తోందని, దీనిపై రాహుల్‌గాంధీ కేంద్ర ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటం చేస్తున్నారని అన్నారు. ఓటు చోరీపై ఇంటింటికి తిరిగి సంతకాలు సేకరించాలని వారు సూచించారు. కార్పొరేటర్లు జక్కుల రవీందర్‌యాదవ్, విజయశ్రీరజాలీ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాస్‌రావు, టీపీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్‌రావు, నేషనల్ కోఆర్డినేటర్ పులి అనిల్, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ తోట వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షురాలు బంక సరళ, కాంగ్రెస్ నాయకులు అరారి సాంబయ్య, ఎండీ అంకూస్, గుంటి కుమార్, సుంచు అశోక్, సిరిల్‌లారెన్స్, దొంగల కుమార్, అజ్గర్, మనోహర్, నీలక్క, స్వరూప, సుకన్య, మానస, సమతా, రేవతి, శ్వేత పాల్గొన్నారు.