
‘స్థానికం’లో కాషాయ జెండా ఎగరేస్తాం
బీజేపీ వరంగల్ జిల్లా ఎన్నికల కన్వీనర్ అరూరి రమేశ్
వరంగల్ చౌరస్తా: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని బీజేపీ వరంగల్ జిల్లా ఎన్నికల కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ ధీమా వ్యక్తం చేశారు. హంటర్ రోడ్డులోని సత్యం కన్వెన్షన్ హాల్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ అధిష్టానం ఆదేశానుసారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీచేసే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి సర్కారు అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. మాజీ ఎంపీ అజ్మీరా సీతారానాయక్, నాయకులు కొండేటి శ్రీధర్, డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు, ఎరబ్రెల్లి ప్రదీప్‌రావు, కంభంపాటి పుల్లారావు, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు ఎడ్ల అశోక్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీశ్, గురుమూర్తి శివకుమార్, రత్నం సతీశ్‌షా, వన్నాల వెంకటరమణ, జిల్లా నాయకులు బాకం హరిశంకర్, మల్లాడి తిరుపతిరెడ్డి, గోగుల రాణా ప్రతాప్‌రెడ్డి, జక్కు రమేశ్, వనంరెడ్డి, తాళ్లపల్లి కుమారస్వామి, సునీత తదితరులు పాల్గొన్నారు.