కేయూ క్యాంపస్ : రాజ్యాంగం ప్రకారం సమాచారం పొందడం ప్రతీ భారతీయ పౌరుడి ప్రాథమిక హక్కు అని, సమాచార హక్కు చట్టం ప్రకారం పౌరులు అడిగిన సమాచారం 30 రోజులలోపు ఇవ్వాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయం నుంచి మంగళవారం ఆన్‌లైన్‌లో అన్ని యూనివర్సిటీల వీసీలు, రిజిస్ట్రార్లు, పరిపాలన అధికారులు, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లకు సమాచారం హక్కుచట్టంపై అవగాహన కల్పించారు. కేయూ నుంచి వీసీ కె. ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వి. రామచంద్రం, ‘లా’ కళాశాల డీన్ ఎం. శ్రీనివాస్, వివిధ పరిపాలన అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ పౌరులు అడిగిన సమాచారం 30 రోజులలోపు ఇవ్వకపోతే సంబంధిత అధికారులు రాష్ట్ర సమాచార హక్కుచట్టం కమిషన్‌కు బాధ్యులవుతారన్నారు. 2005నుంచి సమాచారహక్కుచట్టం అమల్లోకి వచ్చిందని, దీనిని కచ్చితంగా అమలుచేయాల్సిందే అన్నారు.
రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి