
జేఎన్‌ఎస్‌లో కబడ్డీ ఎంపికలు
వరంగల్ స్పోర్ట్స్: పాఠశాల క్రీడల సమాఖ్య (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్–19 బాలబాలికల కబడ్డీ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు 200 మంది క్రీడాకారులు హాజరైనట్లు ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి నరెడ్ల శ్రీధర్ తెలిపారు. ఇందులో ప్రతిభ కనబరిచిన బాలుర నుంచి 12 మంది, బాలికల నుంచి 12 మందిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు మహబూబాబాద్ జిల్లా కొమ్ములవంచలో జరుగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో ఒలింపిక్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.డి. అజీజ్‌ఖాన్, డీవైఎస్‌ఓ గుగులోత్ అశోక్‌కుమార్, డీఐఈఓ ఎ. గోపాల్, ప్రభుత్వ వ్యాయామ అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి దరిగె కుమార్, ఫిజికల్ డైరెక్టర్లు బరుపాటి గోపి, కోట సతీష్, రఘువీర్, టెక్నీకల్ అఫీషియల్స్ పాల్గొన్నారు.