
గాంధీ మార్గం అనుసరించాలి
హన్మకొండ : మహాత్మా గాంధీ చూపిన మార్గం అనుసరణీయమని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. గురువారం హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి సీఎండీ వరుణ్ రెడ్డి, డైరెక్టర్లు, అధికారులు, ఉద్యోగులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎండీ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ.. గాంధీ ఎంచుకున్న శాంతి, అహింసా మార్గం అందరికి మార్గదర్శనీయమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ గాంధీ చూపిన మార్గాన్ని అనుసరిస్తేనే ఆయన కలల సమాజ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న, వాటిని అధిగమించి మహాత్ముడు ఓ వ్యక్తి నుంచి మహాశక్తిలా మారాడని కొనియాడారు. ప్రపంచం మొత్తానికి స్ఫూర్తిగా నిలిచిన మహోన్నత వ్యక్తి, జాతిపిత బాపూజీ అని పేర్కొన్నారు. ఆయన సూక్తులను స్మరించుకుంటూ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడానికి ఉద్యోగులు కంకణ బద్ధులై పనిచేయాలని పిలుపు నిచ్చారు. డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బోనాల కిషన్, చీఫ్ ఇంజనీర్లు రాజు చౌహన్, వెంకట రమణ, సీజీఎం రవీంద్రనాథ్, జీఎం సత్యనారాయణ, డీఈలు సంపత్ రెడ్డి, అనిల్ కుమార్, భాస్కర్, ఏఎస్ హేమంత్ కుమార్, రమణ రెడ్డి, ఎస్‌ఏఓ ఎన్.ఉపేందర్ పాల్గొన్నారు.
రామప్ప శిల్పకళాసంపద అద్భుతం
వెంకటాపురం(ఎం) : రామప్ప శిల్పకళాసంపద అద్భుతమని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తన సతీమణి వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. గైడ్ తాడబోయిన వెంకటేష్ ఆలయ విశిష్టత గురించి వివరించగా రామప్ప శిల్పాకళాసంపద బాగుందని వారు కొనియాడారు, కార్యక్రమంలో టీజీఎన్పీడీసీఎల్ ములుగు డీఈ నాగేశ్వర్‌రావు, విద్యుత్ అధికారులు వేణుగోపాల్, రమేష్, సాంబరాజు, సురేష్, కృష్ణాకర్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.
టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి