
ఉర్సుగుట్ట అభివృద్ధికి కృషి..
● రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
చెడుపై మంచి విజయం సాధించడమే విజయ దశమి అని, రంగలీల మైదానం విస్తరణకు కృషి చేస్తానని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. రంగలీల మైదానంలో గురువారం రాత్రి ఆమె దసరా వేడుకలను ప్రారంభించి మాట్లాడారు. భారతదేశంలో మైసూరు తర్వాత వరంగల్ రంగలీల మైదానంలో భారీగా దసరా వేడుకలు జరుగుతున్నాయని తెలిపారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన రంగలీల మైదానాన్ని అభివృద్ధి చేసి, మరింత పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించాలని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ కోరారు. కళలు, సంస్కృతికి పుట్టినిల్లయిన ఓరుగల్లులో వైభంగా దసరా వేడుకలు నిర్వహించడం అభినందనీయమని మేయర్ గుండు సుధారాణి పేర్కొన్నారు. హైదరాబాద్‌తోపాటు నగర నలుమూలల నుంచి హాజరైన భక్తులకు ఆమె దసరా శుభాకాంక్షలు తెలిపారు. తహసీల్దార్ ఇక్బాల్, కార్పొరేటర్లు మరుపల్లి రవి, పోశాల పద్మ, ముస్కమల్ల అరుణ, జలగం అనిత, పల్లం పద్మ, దసరా ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
రంగలీల మైదానంలో దహనమవుతున్న 70 అడుగుల రావణుడి ప్రతిమ