
కమిషనరేట్‌లో ఆయుధ పూజ
వరంగల్ క్రైం: విజయదశమి పండుగను పురస్కరించుకోని వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో గురువారం ఆయుధ పూజను ఘనంగా నిర్వహించారు. ఆయుధ భాండాగారం వద్ద, ఎంటీ విభాగం, దుర్గామాతకు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ ఆయుధ పూజలు నిర్వహించారు. శమీ వృక్షానికి పూజలు నిర్వహించిన అనంతరం జమ్మి ఆకులను పోలీసు అధికారులు, సిబ్బందికి పంచి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్ కుమార్, క్రైం డీసీపీ గుణశేఖర్, అదనపు డీసీపీలు సురేశ్‌కుమార్, శ్రీనివాస్, ఏఎస్పీ శుభం, ఏసీపీలు నాగయ్య, మధుసూదన్, అనంతయ్య, సరేంద్ర, ఆర్‌ఐలు స్పర్జన్‌రాజ్, శ్రీనివాస్, శ్రీధర్, చంద్రశేఖర్, ఆర్‌ఎస్సైలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.