
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
న్యూశాయంపేట: ఎన్నికల సంఘం జారీ చేసిన నియమ, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యశారద అన్నారు. శుక్రవారం కలెక్టర్‌లో ఆమె మాట్లాడుతూ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని తెలిపారు. ఏదైనా అసౌకర్యం కలిగితే ప్రజలు టోల్‌ఫ్రీ నంబర్ 1800 425 3424, 91542 52936, 0870 2530812 నంబర్లకు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌కు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి పుష్పలత నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని, హెల్ప్‌డెస్క్‌లో సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ఎన్నికలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదులు ఉంటే టోల్‌ఫ్రీ నంబర్లకు తెలియజేయాలని, సజావుగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ కోరారు.
మహాత్మాగాంధీకి నివాళి
మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని గురువారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన గాంధీ చిత్రపటానికి కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు శ్రీనివాస్‌రావు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం హనుమకొండ పబ్లిక్ గార్డెన్‌లోని మహాత్మాగాంధీ విగ్రహానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు.
వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి,
కలెక్టర్ సత్యశారద