
ఘన్‌పూర్ అభివృద్ధికి రూ.50 కోట్లు
స్టేషన్‌ఘన్‌పూర్: స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ అ భివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఘన్‌పూర్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈఏడాది జనవరిలో స్టేషన్‌ఘన్‌పూర్‌ను మున్సిపాలిటీగా చేశామని, సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్లు తీసుకొచ్చానన్నారు. మున్సిపాలిటీ కార్యాలయ భవనం, టౌన్‌హాల్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, సీసీ రోడ్లు, డ్రెయినేజీ లు, రోడ్డు వెడల్పు, తదితర పనులకు నిధులు మంజూరయ్యాయన్నారు. సదరు పనులన్నీంటినీ ఏడా ది లోపు పూర్తి చేస్తానని, వీటితో పాటు వంద పడక ల ఆస్పత్రి, ఇంటిగ్రేటెడ్ డివిజనల్ ఆఫీస్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల తదితర పనులు పూర్తయితే స్టేషన్‌ఘన్‌పూర్ రూపురేఖలు మారుతాయన్నారు. అలా గే, దేవాదుల మూడో దశ పనులకు రూ.1,001 కో ట్లు కోట్లు మంజూరు చేశారని తెలిపారు. బీసీల రిజ ర్వేషన్‌పై సీఎం రేవంత్‌రెడ్డి దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నా రు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినా స్పందన లేదని, బీసీలపై ప్రేమ వల్లించే పార్టీలు బీసీ రిజర్వేషన్‌కు మద్దతు తెలపాలని కోరారు. ఏఎంసీ చైర్మన్ జూలుకుంట్ల లావణ్య శిరీశ్‌రెడ్డి, గ్రంథలయ సంస్థ జిల్లా చైర్మన్ మారుడోజు రాంబాబు, మార్కెట్ వైస్ చైర్మన్ ఐలయ్య, చిల్పూరు దేవస్థాన చైర్మన్ శ్రీధర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి