
భద్రకాళి అమ్మవారికి చతురన్త, విమానక సేవ
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు మంగళవారం మహా ష్టమి (దుర్గాష్టమి) శ్రీభద్రకాళి జన్మోత్సవం సందర్భంగా అమ్మవారిని మహాదుర్గాదేవిగా అలంకరించారు. ఆలయ ప్రధానార్చకుడు శేషు ఆధ్వర్యంలో అర్చకులు నిత్యాహ్నికం నిర్వహించారు. ఉదయం అమ్మవారిని మహా గౌరీ క్రమంలో దుర్గార్చన జరిపి చతురన్త సేవ నిర్వహించారు. సాయంత్రం విశుంభహాదుర్గార్చన జరిపి విమానకసేవ (సర్వభూపాల వాహన సేవ) నిర్వహించారు. అనంతరం శ్రీభద్రకాళి జన్మోత్సవ విధిని నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయశాఖ వరంగల్ జోన్ డిప్యూటీ కమిషనర్ కేఎన్.సంధ్యారాణి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి పూజలు నిర్వహించుకున్న ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. అదేవిధంగా ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అమ్మవారిని ఆలయ ఈఓ రామల సునీత, ధర్మకర్తలు పర్యవేక్షించారు. దేవాలయంలో మహిళలు బతుకమ్మలు ఆడారు.