
శిక్షణ కోసం ఎస్‌డీసీ రోహిత్
హన్మకొండ అర్బన్: ఇటీవల గ్రూప్–1 ద్వారా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికై న తౌటం రోహిత్ నేతను ప్రభుత్వం శిక్షణ కోసం హనుమకొండ జిల్లాకు కేటాయించారు. ఈమేరకు సోమవారం విధుల్లో చేరిన రోహిత్ కలెక్టర్ స్నేహ శబరీష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి తన వివరాలు తెలియజేశారు. కాగా, రోహిత్ తండ్రి పోలీస్ శాఖలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. రోహిత్ అక్క వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ఎస్సైగా, బావ హనుమకొండ కలెక్టరేట్‌లో నాయబ్ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యులంతా దాదాపు ప్రభుత్వ ఉద్యోగులేనన్న సమాచారం తెలియడంతో అధికారులు వారిని అభినందించారు.