
ఆర్టీసీలో అప్రెంటిస్‌షిప్‌నకు అవకాశం
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీలో అప్రెంటిస్‌షిప్ లో చేరడానికి ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయ భాను తెలిపారు. 2020–మే 2025 మధ్య ఉత్తీర్ణులైన ఇంజనీరింగ్, డిప్లొమా, ఏదేని గ్రాడ్యుయేట్స్ అర్హులని ఆయన ఒక ప్రకటనలో వివరించారు. వరంగల్ రీజియన్‌లో టెక్నికల్, నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్లు, డిప్లొమా అభ్యర్థులు అప్రెంటిస్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అభ్యర్థులు తప్పని సరిగా https://nats.education.gov.in వెబ్‌ఐట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులకు హనుమకొండ బస్ స్టేషన్ రెండో అంతస్తులోని వరంగల్ రీజియన్ కార్యాలయంలో అక్టోబర్ 7న ఉదయం 10.30 నుంచి 5 గంటల వరకు వాక్–ఇన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. వివరాలకు 99592 26045 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
● ద్విచక్రవాహనదారుడికి
తీవ్ర గాయాలు
కాటారం: బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం మండల కేంద్రం సమీపం సబ్‌స్టేషన్ వద్ద చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఎర్రగుంటపల్లికి చెందిన మాచెర్ల మల్లేశ్ సొంత పనుల నిమిత్తం ద్విచక్రవాహనంపై మండల కేంద్రంలోని గారెపల్లికి వచ్చి తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో కాళేశ్వరం వైపునకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. బైక్‌ను వెనుక నుంచి ఢీకొంది. దీంతో మల్లేశ్ రోడ్డుపై ఎగిరిపడగా తీవ్రగాయాలయ్యాయి. దీంతో కుటుంబీకులు క్షతగాత్రుడిని 108లో ఎంజీఎం తరలించారు. ప్రస్తుతం మల్లేశ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. ఆర్టీసీ బస్సును స్టేషన్‌కు తరలించారు.
జఫర్‌గఢ్ ఎస్సై రాంచరణ్ సస్పెన్షన్
జఫర్‌గఢ్: జఫర్‌గఢ్ ఎస్సై రాంచరణ్‌ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతి ఆరోపణలపై ఉన్నతాఽధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా సీపీ సన్‌ప్రీత్‌సింగ్ రాంచరణ్‌ను సస్పెండ్ చేశారు. గతంలో ఇదే పోలీస్‌స్టేషన్‌లో పనిచేసిన ఇద్దరు ఎస్సైలు సైతం పాత కేసుల విషయంలో సస్పెన్షన్‌కు గురయ్యారు. వరుసగా ముగ్గురు ఎస్సైలపై వేటుపడడం మండలంలో చర్చనీయాంశంగా మారింది. దీంతో జఫర్‌గఢ్ పోలీస్‌స్టేషన్ అంటేనే ఎస్సైలు హడలెత్తిపోయే పరిస్థితి నెలకొంది.
మనస్తాపంతో వ్యక్తి
ఆత్మహత్య
చిల్పూరు: కుమారుడు చనిపోయాడనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటన జనగామ జిల్లా చిల్పూరు మండలం రాజవరంలో చోటుచేసుకుంది. కు టుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రాములు(48) కుమారుడు గతేడాది మృతి చెందాడు. దీంతో అప్పటి నుంచి రాములు మనోవేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సిరిపురం నవీన్‌కుమార్ తెలిపారు.

ఆర్టీసీలో అప్రెంటిస్‌షిప్‌నకు అవకాశం

ఆర్టీసీలో అప్రెంటిస్‌షిప్‌నకు అవకాశం