
తోటకూర..
రక్తహీనతతో బాధపడేవారికి దీనిని మించిన పోషకాహారం లేదు. ఎందుకంటే రిటోప్లేవిన్, పోలేట్, విటమిన్–ఏ, కే, బీ,సీలతోపాటు కాల్షియం, పోటాషియం, పాస్పరస్, జింక్, కాపర్, మాంగనీస్ వంటి ఖనిజాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి. విత్తనాల నుంచి తీసిన నూనె గుండె వ్యాధిగ్రస్తులకు ఎంతో ఉపయోగకరం. బీపీని నియంత్రిస్తుందని వైద్యులు వెల్లడిస్తున్నారు.
ప్రజలు ఎక్కువ తినేది ఇదే. పోషక విలువలు ఇందులో ఎక్కువ ఉంటాయి. శరీరానికి చలు వ. దగ్గు, ఆస్తమా, ఇతత్రా రుగ్మతలను నివారిస్తుంది. ఐరన్, పోలిక్ యాసిడ్, విటమిన్–‘ఏ’ తోపాటు కీలకమైన ఆమైనో అమ్లాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. పోటాషియం, సల్పర్, సిలికాన్, మాంగనీస్, సోడియం వంటివి సమపాళ్లలో లభిస్తాయి. కడుపులో మంట తగ్గిస్తుంది. దీని జ్యూస్ కాలేయ రుగ్మతలను తొలగిస్తుంది.
అద్భుత ఔషధ ఆహారం. రోజు తింటే ఆరోగ్యానికి మంచిది. కాల్షియం, ఇనుము, పాస్పరస్‌తోపాటు ప్రొటీన్లు ఎక్కువే. ఆకలి పుట్టిస్తుంది. అంతేగాకుండా దగ్గు, వాంతులు, కీళ్ల వ్యాధులు, నులిపురుగులను నివారిస్తుంది.
ఆవకాయ తర్వాత తెలుగు వారు గోంగూర పచ్చడికే ప్రాధాన్యం ఇస్తారు. పచ్చడి పెట్టినా.. పప్పు చేసినా.. మాంసంలో కలిపి వండినా ఇలా ఏ విధంగా చేసినా దీని రుచి అమోఘం. దీని పుంటి కూర అని కూడా పిలుస్తారు. ఐరన్ నిల్వలకు గోంగూర పెట్టింది పేరు. ఇతర విటమిన్లు ఎక్కువ. తెల్లది, ఎర్ర, పుల్ల గోంగూర పేర్లతో ఇది లభిస్తుంది.
జీర్ణక్రియను పెంచుతోంది. ఆకలి పుట్టిస్తుంది. చల్లదనం ఇస్తుంది. కళ్లకు మంచిది. అందుకే దీనిని రోజు ఏదో ఒక రూపంలో తీసుకోవడం మంచిది. ఇందులో ఐరన్, కాల్షియం, పాస్పరస్, విటమిన్ –ఏ, సీలు ఎక్కువ ఉంటాయని వైద్యులు పేర్కొంటున్నారు. ఇతర కూరలతో కలిపి వండినా మంచి వాసన ఇస్తుంది.

తోటకూర..

తోటకూర..

తోటకూర..

తోటకూర..