
కేబుళ్లు క్రమపద్ధతిలో ఏర్పాటు చేయాలి
హన్మకొండ: విద్యుత్ స్తంభాలకు కేబుళ్లును క్రమ పద్ధతిలో అమర్చాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో సంస్థ పరిధిలోని 16 సర్కిళ్ల (జిల్లా) కేబుల్ అపరేటర్లు, బ్రాడ్ బ్యాండ్ ఆపరేటర్లతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ లైన్ల పైనుంచి బ్రాడ్ బ్యాండ్ కేబుల్ వైర్లు ఏర్పాటు చేయొద్దన్నారు. భూమి నుంచి 18–20 ఫీట్ల ఎత్తులో మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. రోడ్ క్రాస్సింగ్స్ లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఉపయోగంలో లేని కేబుల్ వైర్లను 3 నెలలలోపు తొలగించాలని ఆదేశించారు. ప్రతీ బ్రాడ్ బ్యాండ్ కేబుల్ వైర్లను జీఐఎస్ మ్యాపింగ్ చేసుకుని వాటి కోఆర్డి నెట్స్ ఎన్పీడీసీఎల్‌కు అందజేయాలన్నారు. ఆరునెలల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. డైరెక్టర్లు వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, చీఫ్ ఇంజనీర్లు రాజు చౌహాన్, అశోక్, సి.జి.ఎం ఆర్. చరణ్ దాస్, వరంగల్ ఎస్‌ఈ కె.గౌతమ్ రెడ్డి, హనుమకొండ ఎస్‌ఈ పి.మధుసూదన్ రావు, జీఎంలు సురేందర్, డివిజనల్ ఇంజనీర్లు జి.సాంబరెడ్డి, ఎస్.మల్లికార్జున్, అనిల్ కుమార్, బీఎస్‌ఎన్‌ఎల్ డీజీఎం కిషన్, అజయ్, ఎయిర్ టెల్, జియో, యాక్ట్ ఫైబర్ నెట్, ఐ రీచ్ ప్రతినిధులు, స్థానిక కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు.
టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి