
అందాలకు నెలవు మన పర్యాటకం
హన్మకొండ: చరిత్రను, మన సంస్కృతిని తెలిపే గొప్ప పర్యాటక ప్రాంతాలున్న ప్రదేశం ఓరుగల్లు అని హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్ అన్నారు. శనివారం హరిత కాకతీయలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకున్నారు. రాథోడ్ రమేశ్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వళన చేసి ప్రారంభించి మాట్లాడుతూ.. జిల్లా పర్యాటక రంగం అభివృద్ధికి సూచికగా ఎదుగుతోందన్నారు. జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎం.శివాజీ మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో టూరిజం పోటెన్షియల్ ఉన్న ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం 60 మంది విజేతలకు రాథోడ్ రమేశ్, శివాజీ ప్రశంసపత్రాలు అందించారు. విద్యార్థులు, కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రముఖ సామాజిక వేత్త నిమ్మల శ్రీనివాస్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో హరిత కాకతీయ మేనేజర్ శ్రీధర్, డీఆర్డీఏ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీనివాస్, ట్రెజరీ ఆఫీసర్ శ్రీనివాస్, కుమారస్వామి, ధనరాజ్, కుసుమ సూర్య కిరణ్, కె.లోకేశ్వర్, డి.చిరంజీవి, శరత్, సతీశ్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
విద్యార్థులకు ప్యాకేజీ టూర్
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డీఈఓ వాసంతి సహకారంతో వ్యాసరచన పోటీలు నిర్వహించి, అందులో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రత్యేక ప్యాకేజీ టూర్ నిర్వహించారు. విద్యార్థుల కోసం వెయ్యి స్తంభాల ఆలయం, ఖిలా వరంగల్ ప్రాంతాలను చూపించి, గైడ్ సహకారంతో ఆయా ప్రాంత చరిత్రను వివరించారు.
ఆర్డీఓ రాథోడ్ రమేశ్
హరిత కాకతీయలో ఘనంగా
పర్యాటక ఉత్సవాలు