
పూలను పూజించే పండుగ బతుకమ్మ
కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్: పూలను పూజించే పండుగ బతుకమ్మ అని కలెక్టర్ స్నేహ శబరీశ్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళా ఉద్యోగులకు, ఉద్యోగ సంఘాల నాయకులకు కలెక్టర్ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన ఉద్యోగినులు పెద్ద సంఖ్యలో తీరొక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలతో కలెక్టరేట్‌లో సందడి చేశారు. జేఏసీ చైర్మన్ ఆకుల రాజేందర్ మాట్లాడుతూ.. మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని, కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహిచేందుకు సహకరిస్తున్న కలెక్టర్, అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆకవరపు శ్రీనివాస కుమార్ మాట్లాడుతూ.. కలెక్టరేట్లో ప్రతీ సంవత్సరం రాష్ట్రంలో ఎడ్కడా లేని విధంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అనంతరం ఉత్తమ బతుకమ్మలకు కలెక్టర్ బహుమతులు అందజేశారు. ఐసీడీఎస్ బతుకమ్మకు ప్రథమ, డీఆర్డీఏ, హార్టికల్చ ర్‌వారికి సంయుక్తంగా ద్వితీయ, మిషన్ భగీరథ వారికి వారికి తృతీయ, తర్వాతి స్థానంలో నాల్గవ తరగతి ఉద్యోగుల బతుకమ్మకు లభించాయి. కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నేతలు బైరి సోమయ్య, డాక్టర్ ప్రవీణ్, పుల్లూరు వేణుగోపాల్, పనికెల రాజేశ్, శ్యామ్‌సుందర్, మాధవరెడ్డి, వాసం శ్రీనివాస్, కత్తి రమేశ్, రామునాయక్, రాజ్యలక్మి, బోనాల మాధవి, మల్లారం అరుణ, పావని, జ్యోత్స్న, రజిత, సరస్వతి, శ్రీలత, రాజమణి, యమున, ఇందిరా ప్రియదర్శిని, విజయలక్ష్మి, లక్ష్మీప్రసాద్, రాజీవ్, అనూప్, ప్రణయ్, పృథ్వీ, నిఖిల్, అనిల్ రెడ్డి, రాజమణి, నాగరాణి పాల్గొన్నారు