
ప్రతిపాదనలివ్వండి.. నిధులు తెస్తా
● ఎంపీ కడియం కావ్య
● కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం
హన్మకొండ అర్బన్: జిల్లాలో అభివృద్ధి పనుల ప్రతిపాదనలు అందిస్తే వాటి కోసం కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్‌లో కలెక్టర్ స్నేహ శబరీష్ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో ఎంపీ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. రైల్వే సంబంధిత అంశాల్ని, సమస్యల్ని తన దృష్టికి తీసుకొస్తే రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. వరద నీరు నిల్వకుండా తీసుకునే చర్యలపై ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాలకు వైద్య సేవలందించేందుకు జిల్లాకు సీజీహెచ్‌ఎస్ వెల్‌నెస్ సెంటర్ మంజూరైందని పేర్కొన్నారు. అనంతరం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి బోడగుట్ట ప్రాంతంలో తాగునీటి సమస్య, భద్రకాళి దేవాలయం వద్ద పార్కింగ్ ఇబ్బందులు, న్యూ శాయంపేటలో ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులు, వెజ్, నాన్ మార్కెట్ ఏర్పాటు, తదితర అంశాలను ప్రస్తావించారు. సమావేశంలో మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, డీఆర్డీఓ వైవీ గణేశ్, ఆర్డీఓ రాథోడ్ రమేశ్, ‘కుడా’ సీపీఓ అజిత్‌రెడ్డి, ఈఈ భీంరావు, కాజీపేట, హనుమకొండ తహసీల్దార్లు భావ్‌సింగ్, రవీందర్‌రెడ్డి, మున్సిపల్, కాజీపేట దర్గా పీఠాధిపతి ఖుస్రూ పాషా, మాజీ కార్పొరేటర్ అబూబక్కర్, అధికారులు