
ఉత్సాహంగా 2కే రన్
వరంగల్ స్పోర్ట్స్: బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లా క్రీడా ప్రాధికారిత సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం 2కే రన్, సైక్లింగ్ పోటీలు నిర్వహించారు. ఈ రన్ హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం నుంచి అంబేడ్కర్ విగ్రహం, పబ్లిక్ గార్డెన్, అశోకా జంక్షన్ మీదుగా స్టేడియం చేరుకుంది. రన్, సైక్లింగ్ పోటీలను హనుమకొండ డీవైఎస్‌ఓ గుగులోతు అశోక్‌కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారుల్లో స్నేహపూరిత వాతావరణం కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం 2కే రన్ విజేతలు శివ, రవితేజ, ఆరోగ్యపాల్, సైక్లింగ్ విజేతలు చరణ్‌తేజ్, భార్గవ్, హర్శిత్‌కు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వరంగల్ ఒలింపిక్స్ సంఘం కోశాధికారి తోట శ్యాంప్రసాద్, డీఎస్‌ఏ కోచ్‌లు నరేందర్, పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, రాయబారపు నవీన్‌కుమార్, దేవరకొండ ప్రభుదాస్, శ్రీమన్నారాయణ, దేవిక, కూరపాటి రమేశ్, రాజు, మహ్మద్ అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు.