
అపురూప శిల ్పకళ @ రామప్ప
వెంకటాపురం(ఎం) మండలంలోని పాలంపేట పరిధిలో ఉన్న రామప్ప దేవాలయం శిల్పకళాసంపదకు పెట్టింది పేరు. 1213 సంవత్సరంలో కాకతీయులు నిర్మించిన రామప్ప ఆలయానికి 2021లో యునెస్కో గుర్తింపు లభించింది. యునెస్కో గుర్తింపు లభించడంతో దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశీ పర్యాటకుల సంఖ్య సైతం పెరిగింది. ఇసుకనే పునాదిగా చేసి, నీటిలో తేలాడే ఇటుకలతో ఆలయ గోపురాన్ని నిర్మించడం, సరిగమలు పలికే పొన్నచెట్టు, సహజసిద్ధమైన వెలుతురులో కాంతివంతంగా దర్శనమిచ్చే రామలింగేశ్వస్వామి రామప్పకే సొంతం. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు రామప్ప ఆలయాన్ని సందర్శించారు. రామప్పకు వచ్చే పర్యాటకుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.62 కోట్లతో ప్రసాద్ ప్రాజెక్ట్ పథకంలో భాగంగా అభివృద్ధి పనులు చేపడుతోంది. రామప్ప ఆలయానికి కిలోమీటరు దూరంలో ఉన్న రామప్ప సరస్సును రెండు గుట్టల మధ్య ఆనకట్ట నిర్మించి నిర్మించడం ఇక్కడ మరో ప్రత్యేకత.