
భద్రకాళి అమ్మవారికి శేష వాహన సేవ
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శుక్రవారం అమ్మవారిని లలితా మహా త్రిపుర సుందరిగా అలంకరించారు. ఆలయ ప్రధానార్చకుడు శేషు ఆధ్వర్యంలో అర్చకులు నిత్యాహ్నికం, అభిషేకం నిర్వహించారు. ఉదయం అమ్మవారిని స్కందమాత క్రమంలో దుర్గార్చన జరిపి పల్లకిసేవ, సాయంత్రం ధూమ్రహా క్రమంలో దుర్గార్చన జరిపి శేషవాహన సేవ నిర్వహించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి దంపతులు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం, రాత్రి భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. ఆలయ ఈఓ రామల సునీత పర్యవేక్షించారు. రాత్రి జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.