
డెంగీతో బాలుడి మృతి
మడికొండ: నగరంలోని మడికొండకు చెందిన బాలుడు డెంగీ వ్యాధితో శుక్రవారం మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. కాజీపేట మండలం మడికొండకు చెందిన పెనుకు ల రాధిక– కుమార్ దంపతులు గత కొద్ది సంవత్సరాలుగా హైదరాబాద్‌లో కూలిపని చేసుకుంటూ జీ వనం కొనసాగిస్తున్నారు. వారికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు పెనుకుల మనీష్ (14) సంతానం. మనీష్ నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతుండగా.. ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించడగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు.
ఏటీటీఎస్ రాష్ట్ర కమిటీ ఎన్నిక
గీసుకొండ: ఆదివాసీ తోటి తెగ సేవా సంఘం రాష్ట్ర కమిటీని శుక్రవారం జాన్‌పాకలో ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా షెడ్మాకి సంజీవ్, అధ్యక్షుడిగా ఆత్రం కమలమనోహర్, ప్రధాన కార్యదర్శిగా గు ర్రం రఘు, ఉపాధ్యక్షుడిగా ఆత్రం జగన్ , వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కుర్రెంగ వేణు, కోశాధికారిగా షెడ్మాకి భిక్షపతి, వర్కింగ్ కార్యదర్శిగా సోయం రమేశ్, సహాయ కార్యదర్శిగా గుర్రాల సమ్మయ్య, సంయుక్త కార్యదర్శిగా సోయం శరత్‌బాబుతో పాటు పలువురు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.