
29న సద్దుల బతుకమ్మ
ఐనవోలు: ఈ నెల 29న సద్దుల బతుకమ్మను నిర్వహించుకోవాలని ఐనవోలు మల్లికార్జునస్వామి దేవాలయ ముఖ్య అర్చకుడు ఐనవోలు మధుకర్ శర్మ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బతుకమ్మ పండుగను సంప్రదాయ, ఆచారాల ప్రకారమే ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటున్నట్లు తెలిపా రు. తొమ్మిది రోజుల్లో చివరిరోజున సద్దుల బతుకమ్మను నిర్వహించే సంప్రదాయాన్నే కొనసాగించాలని సూచించారు. గతంలో పండుగ నిర్ణయంలో సందేహం కలిగినపుడు కొడకండ్లకు చెందిన పాలకుర్తి నరసింహరామ సిద్ధాంతి సూచించిన విధంగానే సద్దుల బతుకమ్మ జరుపుకున్నట్లు గుర్తుచేశారు. వారి మార్గదర్శకంగా బ్రాహ్మణ సంఘం పెద్దల నిర్ణయం మేరకు 29నే ప్రజలు సద్దుల బతుకమ్మను జరుపుకోవాలని మధుకర్ శర్మ ప్రకటనలో స్పష్టం చేశారు.
కొలంబో మెడికల్ కళాశాల కౌన్సెలింగ్‌కు అనుమతి
కాజీపేట రూరల్: వరంగల్ హంటర్‌రోడ్‌లోని కొలంబొ వైద్యకళాశాల రెండోదశ కౌన్సెలింగ్‌కు కేఎన్‌ఆర్ యూహెచ్‌ఎస్ అనుమతి లభించిందని ఆ కళాశాల నిర్వాహకులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యూనివర్సిటీ కాంపిటెంట్ అథారిటీ కోటా కింద ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశానికి రెండో దశ కౌన్సెలింగ్ కోసం వెబ్ ఆప్షన్లను ఉపయోగించుకోవడానికి గతంలో జారీ చేసిన నోటిఫికేషన్‌కు కొనసాగింపుగా.. ఇందుకు చివరి తేదీని నేటి(శనివారం) మధ్యాహ్నం 2 గటల నుంచి 29వ తేదీ ఉదయం 11 గంటల వరకు పొడిగించినట్లు తెలంగాణ కేఎన్‌ఆర్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ వారు ఉత్తర్వులు జారీ చేసినట్లు వివరించారు.
అమ్మవారిపేటలో
గంజాయి దహనం
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ సందర్భాల్లో పట్టుకున్న గంజాయిని తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ డైరెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం దహనం చేసినట్లు డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ చైర్మన్, ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో 18 కేసుల్లో పట్టుబడిన రూ.3.63 కోట్ల విలువ గల 856 కిలోల గంజా యిని అమ్మవారిపేటలోని కాకతీయ మెడిక్లీన్ సర్వీసెస్ వద్ద దహనం (ఇన్సిరేషన్ పద్ధతిలో) చేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ రవి, ఏసీపీ డేవిడ్‌రాజ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్‌విద్య ఆర్‌జేడీ
బాధ్యతల స్వీకరణ
విద్యారణ్యపురి: ఇంటర్‌విద్య ఇన్‌చార్జ్ ఆర్‌జేడీగా గోపాల్ హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలోని ఆర్‌జేడీ కార్యాలయంలో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీనివా స్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి శ్రీదేవి, జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ తదితరులు ఆర్‌జేడీ గోపాల్‌ను సన్మానించారు. పూలబొకే అందించి అభినందించారు. కార్యక్రమంలో జూనియర్ లెక్చరర్ల సంఘం బాధ్యులు రేవతి, జ్యోతిర్మయి, జాన్‌పాషా, శోభ, పెన్షనర్ల సంఘం బాధ్యులు బా బురావు, ధర్మేంద్ర, వెంకటేశ్వ ర్లు, అశోక్‌కుమార్ పాల్గొన్నారు.

29న సద్దుల బతుకమ్మ