
కేయూ స్టూడెంట్స్ అఫైర్స్ డీన్‌గా ఇస్తారి
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్స్ అఫైర్స్ డీన్‌గా జూవాలజీ విభాగం ప్రొఫెసర్ మామిడాల ఇస్తారిని నియమిస్తూ వీసీ ప్రతాప్‌రెడ్డి ఆదేశాల మేరకు కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇస్తారి గతంలో జూవాలజీ విభాగం అధిపతిగా, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా, హాస్టళ్ల డైరెక్టర్‌గా బాధ్యతలను నిర్వర్వర్తించారు. కాకతీయ యూనివర్సిటీ అధ్యాపకుల సంఘం జనరల్ సెక్రటరీగా కూడా పనిచేశారు. 52 జాతీయ, నాలుగు అంతర్జాతీయ సదస్సుల్లో పరిశోధనాపత్రాలు సమర్పించారు. ఆయన పర్యవేక్షణలో 13మంది పీహెచ్‌డీ పూర్తి చేశారు. యూనివర్సిటీలోని విద్యార్థి వ్యవహారాల విభాగంలో సమర్థవంతమైన పాలన, పరిశోధనల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమ కార్యక్రమాల అమలు మరింత బలోపేతానికి స్టూడెంట్స్ అఫైర్స్ డీన్‌గా ఇస్తారి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. వీసీ ప్రతాప్‌రెడ్డి శుక్రవారం ఇస్తారికి ఉత్తర్వులు అందజేశారు. సంవత్సరంపాటు ఇస్తారి ఈ పదవిలో కొనసాగనున్నారు. కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ వెంకయ్య, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ఆచార్య ఈసం నారాయణ, ఫార్మసీ డీన్ గాదె సమ్మయ్య తదితరులు ఇస్తారిని అభినందించారు.
ఉత్తర్వులు జారీ చేసిన కేయూ రిజిస్ట్రార్