
నేటి తరానికి ఆదర్శంగా చాకలి ఐలమ్మ
కాజీపేట అర్బన్: నేటి తరానికి చాకలి ఐలమ్మ ఆదర్శంగా ని లుస్తోందని ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కలెక్టర్ స్నేహ శబరీశ్, మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ కొనియాడారు. జిల్లా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా శుక్రవారం న్యూశాయంపేటలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తితో ముందుకు సా గాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మామిండ్ల రాజు, వరంగల్, హనుమకొండ జిల్లాల ఆర్డీఓలు రమేశ్, సత్యపాల్‌రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
వరంగల్ క్రైం: వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పరిపాలన విభాగం అదనపు డీసీపీ రవి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు సురేశ్‌కుమార్, శ్రీనివాస్, ఏఓ సంపత్, ఏసీపీలు అంతయ్య, జాన్‌నర్సింహులు, ఆర్‌ఐలు, ఇన్‌స్పెక్టర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.