
సీసీఎస్ సభ్యులకు కొత్త పథకాలు
● ఎస్సీఆర్‌ఈ సీసీఎస్ ప్రెసిడెంట్ చిలుకు స్వామి
కాజీపేట రూరల్: సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ (ఎస్సీఆర్‌ఈ సీసీఎస్) లిమిటెడ్ సభ్యులకు కొత్త పథకాలకు రూపకల్పన చేసినట్లు ప్రెసిడెంట్ డాక్టర్ చిలుకు స్వామి అన్నారు. కాజీపేట రైల్వే జనరల్ ఇన్‌స్టిట్యూట్‌లో గురువారం నామినేటెడ్ డైరెక్టర్ దేవులపల్లి రాఘవేందర్ అధ్యక్షతన ఈసీసీఎస్ 11వ నియోజకవర్గ కాజీపేట డెలిగేట్స్ మీటింగ్ జరిగింది. ముఖ్య అతిథిగా చిలుకు స్వామి హాజరై మాట్లాడుతూ కాజీపేటలోని సుమారు 2,900 మంది సీసీఎస్ సభ్యులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 26న సికింద్రాబాద్ హెడ్‌ఆఫీస్‌లో జరిగే డైరెక్టర్ల సమావేశంలొ కొత్త పథకాలకు రూపకల్పన చేయనున్నట్లు తెలిపారు. యాక్సిడెంట్ ఇన్స్‌రెన్స్ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు, ఒకే లోను సిస్టంలో రూ.20 లక్షలు ఇచ్చేందుకు, దీపావళి కానుకగా సభ్యుల ఖాతాలో డివిడెంట్ జమ, నాన్ రికవరీ కేసులకు లీగల్ నోటీసులు పంపించి చట్టపరంగా రికవరీ చేయుట, మరణించిన సొసైటీ సభ్యుడికి ఫెనరల్ కోసం ఇచ్చే రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు పెంచనున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో ఈసీసీఎస్ డైరెక్టర్ డాక్టర్ డి.శ్రీనివాస్‌యాదవ్, 10వ నియోజకర్గ డైరెక్టర్ ఓవై స్వామి, డెలిగేట్స్ పాక వేదప్రకాశ్, బి.శ్రీనివాస్, ఇ.రాజేందర్, జి.రాజు, సునీల్, నల్ల రమేశ్, ఎల్‌కే యాదవ్ పాల్గొన్నారు.