
దివ్యాంగ విద్యార్థుల ప్రగతికి తోడ్పడాలి
విద్యారణ్యపురి: దివ్యాంగ విద్యార్థుల ప్రగతికి తోడ్పడేలా ఐఈఆర్పీలు, స్పెషల్ ఎడ్యుకేటర్లు కృషి చేయాలని హనుమకొండ జిల్లా కమ్యూనిటీ మొ బిలైజింగ్ కో–ఆర్డినేటర్ బద్దం సుదర్శన్‌రెడ్డి కోరా రు. బీఎస్‌ఐ ఆటిజం అండ్ మల్టీస్పెషాలిటీ చైల్డ్ డెవలప్‌మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో రిహబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఆర్‌సీఐ) సౌజన్యంతో కా జీపేట బాల వికాసలో శిక్షణ నిర్వహించారు. ఫండమెంటల్ ఆఫ్ హియరింగ్ డెఫ్‌నెస్ అండ్ ఆడియోలాజికల్ మేనేజ్‌మెంట్ శిక్షణలో భాగంగా స్పెషల్ ఎడ్యుకేటర్లకు, ఐఈఆర్పీలకు శిక్షణ ఇచ్చారు. ఇందులో ఢిల్లీ నుంచి వచ్చిన డాక్టర్ క్రాంతికుమార్ మాట్లాడుతూ.. మూడు రోజులపాటు శిక్షణ పొందాక ఇందులో నేర్చుకున్న అంశాలను దివ్యాంగ వి ద్యార్థులకు అమలు చేయాలని సూచించారు. రిసో ర్స్ పర్సన్లుగా బీఎన్‌వై ఆటిజం, మల్టీ స్పెషాలిటీ చైల్డ్ డెవలప్‌మెంట్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ బి.నాగరాజు, వరంగల్ సమగ్రశిక్ష కమ్యూనిటీ మొబలైజింగ్ కో–ఆర్డినేటర్ కట్ల శ్రీనివాస్, కిరణ్‌కుమార్, న రేశ్, కపిల్‌రెడ్డి, సంజీవ్‌కుమార్, వరలక్ష్మి, ప్రియాంక, భరత్‌రెడ్డి పాల్గొన్నారు. శిక్షణలో వివిధ జిల్లాల స్పెషల్ ఎడ్యుకేటర్లు, ఐఈఆర్పీలు పాల్గొన్నారు.