
మున్సిపల్ కమిషనర్‌గా రాజశేఖర్‌రెడ్డి..
బచ్చన్నపేట: మండల కేంద్రానికి చెందిన చిమ్ముల రాజశేఖర్‌రెడ్డి గ్రూప్–1లో మున్సిపల్ కమిషనర్ పోస్టుకు ఎంపికయ్యారు. రాజశేఖర్‌రెడ్డి పదో తరగతి బచ్చన్నపేట ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్మీడియట్ ఏపీఆర్‌జేసీ నిమ్మకూర్‌లో, బీటెక్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పూర్తి చేశారు. 2014లో ఏపీపీఎస్సీలో పంచాయతీ కార్యదర్శిగా ఎంపికై న రాజశేఖర్‌రెడ్డి 2024లో గ్రూప్–4లో 279 ర్యాంకు సాధించారు. గ్రూప్–2లో 424 మార్కులు సాధించి రాష్ట్ర 8వ ర్యాంకర్‌గా నిలిచారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు చిమ్ముల అరుణ, మల్లారెడ్డితోపాటు గ్రామస్తులు రాజశేఖర్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.