లక్ష్య సాధకులు.. | - | Sakshi
Sakshi News home page

లక్ష్య సాధకులు..

Sep 26 2025 6:00 AM | Updated on Sep 26 2025 6:44 AM

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఆషామాషీ కాదు. దీనికి కఠోర తపస్సు చేయాలి. క్షేత్ర స్థాయి నుంచి మొదలు.. ఉన్నత స్థాయి వరకు పోస్టులు వందల్లో ఉంటే దరఖాస్తులు లక్షల్లో ఉంటున్నాయి. ఈ తరుణంలో అర మార్కు కూడా అత్యంత విలువైంది. అందుకే విజయం వరించాలంటే పుస్తకాలతో నిత్యం కుస్తీ పట్టాలి.. దోస్తీ కట్టాలి. క్షణం కూడా వృథా చేయకుండా లక్ష్యం వైపు సాగాలి. అప్పుడే విజేతలుగా నిలుస్తాం. సరిగ్గా ఇదే సూత్రాన్ని పాటించిన ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులు బుధవారం అర్ధరాత్రి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రకటించిన గ్రూప్‌–1 ఫలితాల్లో విజేతలుగా నిలిచారు. పలు ఉన్నతస్థాయి కొలువులను దక్కించుకున్నారు. వారి విజయగాథలపై ప్రత్యేక కథనం..

రిటైర్డ్‌ ఎస్సై కుమారుడికి ర్యాంకు..

ఖిలా వరంగల్‌: వరంగల్‌ అబ్బనికుంటకు చెందిన రిటైర్డ్‌ ఎస్సై మున్నీరుల్లా కుమారుడు ఎండీ రహిమతుల్లా గ్రూప్‌–1లో ఉత్తమ ర్యాంకు సాధించి ఎంపీడీఓ ఉద్యోగానికి ఎంపికయ్యారు. మునీరుల్లా మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై గా విధులు నిర్వర్తిస్తూ ఇటీవల రిటైర్డ్‌ అయ్యారు. మొదటి నుంచి రహిమతుల్లా పట్టుదల, క్రమశిక్షణతో చదివి ఎంపీడీఓగా ఉద్యోగం దక్కించుకున్నాడు. దీంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌గా పవన్‌కల్యాణ్‌..

గార్ల: మండలంలోని పెద్దకిష్టాపురం గ్రామానికి చెందిన గంగా వత్‌ పవన్‌కల్యాణ్‌ గ్రూప్‌–1లో అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. కాగా, పవన్‌కల్యాణ్‌ హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఒకటి నుంచి ఇంటర్‌ వరకు, ఢిల్లీ యూనివర్సిటీలో బీఏ పూర్తి చేశారు. మొదటి ప్రయత్నంలోనే గ్రూప్‌–1లో 454 మార్కులు సాధించి ఎస్టీ విభాగంలో 527వ ర్యాంకు పొంది ట్రెజరీ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌లో ఐఏఎస్‌ సాధించడమే తన లక్ష్యమన్నారు.

కమర్షియల్‌ ట్యాక్స్‌

ఆఫీసర్‌గా వైష్ణవి..

రాయపర్తి: మండలంలోని పెర్కవేడు గ్రామానికి చెందిన పుల్లూరి రఘుబాబు, నాగరాణి దంపతుల పెద్ద కుమార్తె వైష్ణవి గ్రూప్‌–1లో 120 ర్యాంకు సాధించి కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌ పోస్టుకు ఎంపికయ్యారు. వైష్ణవి.. ఇంటర్మీడియట్‌ హైదరాబాద్‌లోని శ్రీచైతన్య ఐఏఎస్‌ అకాడమీలో, డిగ్రీ మెరండ హౌజ్‌ ఢిల్లీ యూనివర్సిటీలో చదివారు. కాగా, వైష్ణవికి తల్లిదండ్రులతోపాటు గ్రామస్తులు శుభాకాంక్షలు తెలిపారు. వీరు ప్రస్తుతం వరంగల్‌ కాశిబుగ్గ లక్ష్మీపురంలో నివాసం ఉంటున్నారు.

స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా

తేజస్వినిరెడ్డి..

గార్ల/శాయంపేట: గార్ల ఎంపీఓ జె. తేజస్వినిరెడ్డి గ్రూప్‌–1లో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ పోస్టుకు ఎంపికయ్యారు. 532.5 మార్కులు సాధించి స్టేట్‌ 4వ ర్యాంకు సాధించారు. దీంతో తేజస్వినిరెడ్డిని ఎంపీడీఓ మంగమ్మ, తహసీల్దార్‌ శారద, సీనియర్‌ అసిస్టెంట్‌ రాజేశ్‌, సూపరింటెండెంట్‌ ఉదయశ్రీ, కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

లక్ష్య సాధకులు..1
1/4

లక్ష్య సాధకులు..

లక్ష్య సాధకులు..2
2/4

లక్ష్య సాధకులు..

లక్ష్య సాధకులు..3
3/4

లక్ష్య సాధకులు..

లక్ష్య సాధకులు..4
4/4

లక్ష్య సాధకులు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement