కలెక్టరేట్‌లో ప్రక్షాళన | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌లో ప్రక్షాళన

Sep 26 2025 6:00 AM | Updated on Sep 26 2025 6:00 AM

కలెక్

కలెక్టరేట్‌లో ప్రక్షాళన

హన్మకొండ అర్బన్‌: కలెక్టరేట్‌లోని రెవెన్యూ శాఖలో ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో సాక్షి దినపత్రికలో వస్తున్న వరుస కథనాలు సంచలనం రేపుతున్నాయి. వరుస ఘటనలతో వార్తల్లోకి ఎక్కిన పరిపాలన కేంద్రంలో ఎట్టకేలకు అధికారులు దిద్దుబాటు చర్యలకు సిద్ధమయ్యారు. గురువారం కలెక్టరేట్‌లోని ఏ సెక్షన్‌ కార్యకలాపాలు సాగించే జీ6 విభాగాన్ని అదనపు కలెక్టర్‌ వెంకట్‌రెడ్డి సందర్శించారు. అక్కడ సిబ్బంది పనిచేస్తున్న విధానం, ఏ–సెక్షన్‌ చాబర్‌ను పరిశీలించారు. చాంబర్‌ను వెంటనే తొలగించాలని కలెక్టరేట్‌ ఏఓను ఆదేశించారు. అదేవిధంగా సెక్షన్‌లో ఎవరు ఉన్నది, ఏం జరుగుతుంది బయటకు కనిపించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించడంతో పనులు మొదలయ్యాయి. ఏ సెక్షన్‌ చుట్టూ పెట్టని కోటలా నిర్మించుకున్న చాంబర్‌ను అధికారులు పూర్తిగా తొలగించారు.

డిప్యుటేషన్‌ రద్దు

ప్రాథమిక చర్యల్లో భాగంగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ సెక్షన్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ ఇర్ఫాన్‌ సోహియల్‌ను ఎస్సారెస్పీకి పంపిన అధికారులు.. తాజాగా అదే ఏ సెక్షన్‌లో విధులు నిర్వర్తిస్తున్న సీనియర్‌ అసిస్టెంట్‌ కృపావతి డిప్యుటేషన్‌ రద్దుచేసి తన పాత స్థానంలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు. కృపావతి వాస్తవ పోస్టు వేలేరు మండలం ఆర్‌ఐగా విధులు నిర్వర్తించాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆమె డిప్యూటేషన్‌ రద్దయింది. వేలేరులో రిపోర్టు చేయనున్నారు. అదేవిధంగా మిగిలిన డిప్యుటేషన్లపై కూడా అధికారులు విచారణ జరపాలని ఉద్యోగులు కోరుతున్నారు.

అధికారులకు చేరిన నివేదిక..

కలెక్టరేట్‌లో కామాంధుడి ఘటనపై కలెక్టర్‌ ఐసీసీ కమిటీ ఏర్పాటు చేశారు. కాస్త ఆలస్యంగానైనా కమిటీ నివేదిక సమర్పించిందని ఉద్యోగులు పేర్కొంటున్నారు. బాధితులు, నిందితులతోపాటు సాక్షుల నుంచి కూడా లిఖితపూర్వకంగా కమిటీ వివరాలు సేకరించింది. ఆ వివరాల ప్రకారం ఏ చర్యలు తీసుకోవాలో ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా కలెక్టర్‌ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సంచలనం రేపిన ఈ ఘటనపై నివేదికలో ఏముంది, కలెక్టర్‌ ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న దానిపై ఉద్యోగుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది

బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

భూపాలపల్లి అర్బన్‌: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా గురువారం భూపాలపల్లి ఏరియాలోని ఓపెన్‌ కాస్టు గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఏరియాలోని కేటీకే ఓపెన్‌ కాస్టు –2,3 ప్రాజెక్టుల్లో మూడు షిప్టుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఓపెన్‌కాస్టు ప్రాజెక్టుల్లోని పని స్థలాల్లో వర్షపు నీరు వచ్చి చేరింది. గని ఆవరణలో రోడ్లు బురదగా మారాయి. దీంతో సుమారు 8 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఓపెన్‌కాస్టులో చేరిన వర్షపు నీటిని భారీ మోటార్లు ఏర్పాటు చేసి బయటకు ఎత్తిపోస్తున్నారు.

జీ6 విభాగాన్ని పరిశీలించిన

అదనపు కలెక్టర్‌

సీనియర్‌ అసిస్టెంట్‌ డిప్యుటేషన్‌ రద్దు

చాంబర్‌ తొలగించిన అధికారులు

కలెక్టరేట్‌లో ప్రక్షాళన
1
1/4

కలెక్టరేట్‌లో ప్రక్షాళన

కలెక్టరేట్‌లో ప్రక్షాళన
2
2/4

కలెక్టరేట్‌లో ప్రక్షాళన

కలెక్టరేట్‌లో ప్రక్షాళన
3
3/4

కలెక్టరేట్‌లో ప్రక్షాళన

కలెక్టరేట్‌లో ప్రక్షాళన
4
4/4

కలెక్టరేట్‌లో ప్రక్షాళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement