
నాటకాలు ఇతిహాసాల్ని తెలియజేస్తాయి
హన్మకొండ కల్చరల్: నాటకాలు ఇతిహాసాలను తెలియజేస్తాయని, నాటకాలను చూసే రామాయణ మహాభారత ఇతివృత్తాలను తెలుసుకునేవాళ్లమని తెలంగాణ రాష్ట్ర మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, ఎఫ్‌డీసీ వారి ఆధ్వర్యంలో మూడురోజుల పాటు నిర్వహిస్తున్న పందిళ్ల శేఖర్ బాబు స్మారక నాటకోత్సవం–2025 ముగిశాయి. ఈమేరకు గురువారం సాయంత్రం నాటక సమాజాల రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల సదానందం, వనం లక్ష్మీకాంతారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మధుసూదనాచారి, వీనస్ ఐటీఐ అధినేత శ్రీరామోజు సుందరమూర్తి, అడిషనల్ డీసీపీ నల్ల మల రవి, ఆర్యవైశ్య నాయకులు గట్టు మహేశ్‌బాబు ముఖ్య అతిఽథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. సమాజంలో చైతన్యం కలిగించడం అనేది నాటకాలు, పాటల వల్లనే సాధ్యమవుతుందన్నారు. అనంతరం విజయవాడ సాంస్కృతిక సమితి వారు ప్రదర్శించిన మమ్మల్ని బతకనివ్వండి నాటకం, కర్నూలు టీజీవీ కళాక్షేత్రం వారు ప్రదర్శించిన జగదేకసుందరి సామా పద్యనాటక ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈసందర్భంగా నటులు, దర్శకులు బీఎం రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పందిళ్ల రమేశ్‌బాబు, ఆకుల శ్రీకాంత్, మారేడోజు సదానందాచారి, జూలూరు నాగరాజు, డా.వొడపల్లి చక్రపాణి, పందిళ్ల అశోక్‌బాబు, కార్యవర్గ సభ్యులు దేవరరాజు రవీంద్రరావు, మాడిశెట్టి రమేశ్, గూడూరు బాలాజీ, కళాకారులు పాల్గొన్నారు.
మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ
మధుసూదనాచారి
ఆకట్టుకున్న‘మమ్మల్ని బతకనివ్వండి’,
‘జగదేకసుందరి సామా’ నాటక ప్రదర్శనలు
ముగిసిన నాటకోత్సవాలు