
గ్రేడ్–2 మున్సిపల్ కమిషనర్‌గా ఉదయ్‌కుమార్
రఘునాథపల్లి: మండల కేంద్రానికి చెందిన కొయ్యడ ఉదయ్‌కుమార్ గ్రూప్–1 ఫలితాల్లో గ్రేడ్–2 మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం సాధించారు. నిరుపేద కుటుంబానికి చెందిన కొయ్యడ ప్రభాకర్– లక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు ఉదయ్‌కుమార్ రఘునాథపల్లి తేజస్వి స్కూల్‌లో పదో తరగతి వరకు, స్టేషన్‌ఘన్‌పూర్‌లో పాలిటెక్నిక్ , ఘట్‌కేసర్ విజ్ఞాన భారతిలో బీటెక్, నిజాంకాలేజీలో ఎంబీఏ పూర్తి చేశారు. కాగా, గతేడాది డిసెంబర్‌లో సింగరేణిలో పర్సనల్ మేనేజర్ ఉద్యోగం సాధించి విధులు నిర్వర్తిస్తున్నారు.
నయీంనగర్/కేయూ క్యాంపస్: గ్రేటర్ వరంగ ల్ 54వ డివిజన్ శ్రీనగర్ కాలనీకి చెందిన రావుల జగదీశ్వర్ ప్రసాద్, శ్రీదే వి దంపతుల కుమారుడు తరుణ్‌ప్రసాద్ ఎంపీడీఓ పోస్టుకు ఎంపికయ్యా రు. తరుణ్‌ప్రసాద్ కిట్స్ వరంగల్‌లో బీటెక్ పూర్తిచేసి గ్రూప్–1 కు ప్రిపేర్ అవు తూ మొ దటి ప్రయత్నంలోనే విజయం సాధించారు. ఈ సందర్భంగా తల్లిందడ్రులు, బంధుమిత్రులు తరుణ్‌ప్రసాద్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
డీఎస్పీగా దైనంపల్లి ప్రవీణ్..
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని మానసపల్లికి చెందిన దైనంపల్లి ప్రవీణ్‌కుమార్‌కు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్–1 పరీక్షల్లో 105 ర్యాంకు సాధించారు. మల్టీజోన్–1లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) పోస్టుకు ఎంపికయ్యారు. కాగా, ప్రవీణ్ ప్రస్తుతం యూపీఎస్సీ మెయిన్స్ కూడా రాసి ఆ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

గ్రేడ్–2 మున్సిపల్ కమిషనర్‌గా ఉదయ్‌కుమార్

గ్రేడ్–2 మున్సిపల్ కమిషనర్‌గా ఉదయ్‌కుమార్