
బతుకమ్మ వేడుకలను జయప్రదం చేయాలి
● బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్
హన్మకొండ: బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఈనెల 28న బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ తెలిపారు. గురువారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ అస్తిత్వానికి చిహ్నం అని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో బతుకమ్మ పండుగను మహిళలు ఎంతో గౌరవంగా జరుపుకునేవారని తెలిపారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపడుచులకు బతుకమ్మ కానుకలు ఇచ్చారని గుర్తుచేశారు. మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, మాజీ విప్ గొంగిడి సునీత, కరీంనగర్ జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమ హాజరయ్యే వేడుకలను జయప్రదం చేయాలని ఆయన కోరారు. కార్పొరేటర్ ఇమ్మడి లోహిత రాజు, మహిళా నాయకులు డాక్టర్ హరిరామదేవి, జ్యోతి యాదవ్, విజయ, లత, సరస్వతి, మణి, హైమావతి, పూర్ణిమ, శ్వేత, అంజలీదేవి, శ్రీలత, విజయలక్ష్మి, అరుంధతి, స్నేహలత, రమ, పావని, విజయ పాల్గొన్నారు.