
శ్రీమహాలక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యం
హన్మకొండ కల్చరల్: శ్రీమహావిష్ణువు హృదయంలో కొలువైన శ్రీమహాలక్ష్మీదేవి అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని వేయిస్తంభాల దేవాలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. వేయిస్తంభాల ఆలయంలో జరుగుతున్న శ్రీరుద్రేశ్వరీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గురువారం అర్చకులు గంగు మణికంఠశర్మ, సందీప్‌శర్మ, ప్రణవ్ ప్రభాతసేవ, స్వామివారికి అభిషేకాలు జరిపి అమ్మవారిని శ్రీమహాలక్ష్మీదేవిగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సతీమణి నాయిని నీలిమ ఆధ్వర్యంలో అమ్మవారికి పుష్పార్చన నిర్వహించారు. పరమాన్నం నైవేద్యంగా నివేదన చేశారు. వేదపండితులు గుదిమెళ్ల విజయకుమారాచార్య యాగశాలలో మహాసుదర్శన హోమం, చండీహోమం చేశారు. సీఎంఆర్ షాపింగ్‌మాల్ సౌజన్యంతో భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. సాయంత్రం బోడిగె లక్ష్మీనారాయణ భాగవతార్ హరికథ చెప్పారు. ఈఓ అనిల్‌కుమార్ పర్యవేక్షించారు.