
సొసైటీ సభ్యులకు చెక్కుల పంపిణీ
హన్మకొండ: గ్రామీణ తపాలా ఉద్యోగుల కో–ఆపరేటివ్ సోసైటీ సభ్యులకు ఆర్థిక సాయం చెక్కులను వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పంపిణీ చేశారు. గురువారం హనుమకొండ కనకదుర్గ కాలనీలోని స్వగృహంలో జరిగిన కార్యక్రమంలో కో– ఆపరేటివ్ సభ్యుల మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం కింద రూ.50 వేల చొప్పున ఎంపీ కడియం కావ్య చేతుల మీదుగా కె.రత్నకుమారి, ఊకే బుచ్చయ్య కుటుంబ సభ్యులు కె.భాస్కర్, ఊకే కన్నక్కకు అందించారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. గ్రామీణ తపాలా ఉద్యోగుల సంక్షేమం కోసం సహకార సంఘాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సొసైటీ అధ్యక్షుడు బొద్దున వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. గ్రామీణ తపాలా ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా తమ సొసైటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సొసైటీ కార్యదర్శి మర్రి కొమురారెడ్డి, డైరెక్టర్లు పెరుమామిళ్ల తిరుపతి, ఎం.మనోహర్, బి.వెంకటేశ్, బాపూజీ, పిట్టల అశోక్, చాడ జైహింద్ రెడ్డి, పి.శ్రీలత, ఎండీ అజీజ్ పాల్గొన్నారు.