
చోరీలు చేసిన వారిని అరెస్ట్ చేయాలి
నెలవారీ నేర సమీక్షలో సీపీ సన్‌ప్రీత్‌సింగ్
కేయూ క్యాంపస్: చోరీలు చేసిన వారిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. గురువారం కాకతీయ యూనివర్సిటీలోని సెనేట్‌హాల్‌లో నిర్వహించిన నెలవారీ నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. నిందితులను పట్టుకుని, చోరీలకు సంబంధించిన సొత్తు స్వాధీనం చేసుకున్నప్పుడే పోలీసులపై ప్రజలకు నమ్మకం, గౌరవం పెరుగుతుందన్నారు. నేరాల నియంత్రణకు ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషిచేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్, వరంగల్, జనగామ ఏసీపీలు శుభం, చేతన్‌నితిన్, అదనపు డీసీపీలు రవి, ప్రభాకర్‌రావు, బాలస్వామి, సురేశ్‌కుమార్, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.