
అశాసీ్త్రయ పద్ధతులను ఆశ్రయించొద్దు
మద్యం అలవాటు మాన్పించేందుకు చాలా మంది అశాసీ్త్రయ పద్ధతుల వైపు వెళ్తున్నారు. అవి ఫలితాలను ఇవ్వకపోగా ఆర్థిక నష్టంతోపాటు ప్రాణాలకే ప్రమాదం. డీఅడిక్షన్ థెరపి ద్వారా శాశ్వతంగా మద్యానికి దూరం చేస్తూ సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తీర్చిదిద్దొచ్చు. 25 సంవత్సరాల క్రితం హెల్పింగ్ హ్యాండ్ సొసైటీని స్థాపించాం. దశాబ్దకాలంగా వ్యసనపరుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అందులో వంశపారపర్యంగా 25శాతం ఉంటే మిగతా 75శాతం సమాజంలోని పరిస్థితుల ప్రభావమే.
పి.రాము, డీఅడిక్షన్ థెరపిస్ట్, డైరెక్టర్,
హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ, హనుమకొండ