
రెండు బైక్‌లు ఢీ..
● యువకుడి మృతి.. సిద్ధాపురంలో ఘటన
హసన్‌పర్తి: రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్ర మాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన హసన్‌పర్తి మండలం సిద్ధాపురంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. హసన్‌పర్తి మండలం బైరాన్‌పల్లికి చెందిన జక్కుల నాగరాజు(24)ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం బైక్‌పై అర్వపల్లి నుంచి బైరాన్‌పల్లికి బయలుదేరా డు. సిద్ధాపురం ఎస్‌బీఐ వద్దకు చేరుకోగా ఎదురుగా ద్విచక్రవాహనం వేగంగా వచ్చి నాగరాజు బైక్‌ను ఢీ కొంది.ఈఘటనలో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, నాగరాజు మృతదేహాన్ని వర్ధన్నపేట ఎ మ్మెల్యే నాగరాజు సందర్శించారు. ఈ సందర్భంగా మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రమాద వివరాలు తెలుసుకున్నారు.
నర్సంపేటలో ఆగి ఉన్న లారీని ఢీకొని వ్యక్తి..
నర్సంపేట రూరల్ : బైక్.. ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ప్ర మాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం నర్సంపేట అయ్యప్పదేవాలయం సమీపంలో చో టుచేసుకుంది. స్థానికులు, పోలీ సుల కథనం ప్రకారం.. నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామానికి చెందిన పా యిరాల శంకర్ (40) ఓ ప్రైవేట్ పాఠశాలలో వ్యాన్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వ్యక్తిగత పని నిమిత్తం బైక్‌పై మహేశ్వరం నుంచి నర్సంపేటకు వచ్చాడు. తిరిగి స్వగ్రామం వెళ్తుండగా అయ్యప్పదేవాలయం సమీపంలో రోడ్డు పక్కనే ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై రవికుమార్ ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య రాజ్యలక్ష్మి, కుమారుడు, కుమార్తెలు ఉన్నారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
బతుకమ్మ ఆడుతూనే
అనంతలోకాలకు..
● గుండెపోటుతో వివాహిత మృతి
కొత్తగూడ: బతుకమ్మ ఆట ఆ డుతూనే ఓ వివాహిత అనంతలోకాలకు చేరింది. గుండెపోటుతో మృతి చెందింది. ఈ ఘటన ఆదివారం మండలంలోని ఎంచగూడెంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన శెట్టి మౌనిక(30) గ్రామస్తులతో కలిసి బతుకమ్మ ఆడుతోంది. ఈ క్రమంలో గుండెపోటుకు గురై కుప్ప కూలింది. దీంతో వెంటనే హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలికి భర్త పరశురాం, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కాగా, అమ్మా.. ఇంకా పడుకున్నావేంది లే అంటూ ఆ చిన్నారులు తల్లిని తట్టి లేపుతుండడం చూసి ప్రతీ ఒక్కరూ కన్నీరుమున్నీరుగా విలపించారు
ఓపెన్ స్కూల్ టెన్త్,
ఇంటర్ పరీక్షలు షురూ
విద్యారణ్యపురి : ఓపెన్ స్కూల్ టెన్త్ , ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యా యి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో టెన్త్ పరీక్షలకు 192 మందికి 142 మంది విద్యార్థులు హాజరుకాగా ఇంటర్మీడియట్ పరీక్షకు 273 మందికి 195 మంది విద్యార్థులు హాజరయ్యారని ఓపెన్ స్కూల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ సదానందం తెలిపారు.