
పేద, మధ్య తరగతికి జీఎస్టీ పండుగ
వరంగల్ చౌరస్తా : ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేదల సంక్షేమమే ధ్యేయంగా నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తున్నారని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. సోమవారం వరంగల్ ఎల్‌బీ నగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో నెక్స్ట్ జెన్ జీఎస్టీ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ హాజరై మాట్లాడారు. పేదలు, రైతులు, విద్యార్థులు, మధ్యతరగతి కుటుంబాల జీవితాలను మోదీ ప్రభుత్వం సులభతరం చేస్తోందన్నారు. పండుగల సమయంలో పేద కుటుంబాలకు ఉపశమనం కలుగుతుందన్నారు. కాంగ్రెస్ పాలనలో పెరిగిన ధరలు, పన్నుల భారం వల్ల ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలకు మోదీ జీఎస్టీ సంస్కరణలు ఊరట కలిగిస్తున్నాయన్నారు.రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వన్నాల వెంకటరమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరిశంకర్, మల్లాడి తిరుపతిరెడ్డి, ఉపాధ్యక్షుడు గడల కుమార్, పట్టాపురం ఏకాంతం గౌడ్, నాయకులు కూచన క్రాంతికుమార్, వడ్డేపల్లి నరసింహులు, సముద్రాల పరమేశ్వర్, బైరి మురళీకష్ణ, మార్టిన్ లూథర్, కందిమల్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు.