
ఎంఎల్‌హెచ్‌పీని వెనక్కి పంపాలి
ఎంజీఎం: వరంగల్ ఎంజీఎంలోని అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్‌లో డిప్యుటేషన్‌పై వచ్చిన మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్‌హెచ్‌పీ)ను వెనక్కి పంపాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ అనుబంధ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాదనాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు యూనియన్ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని చౌటపల్లి గ్రామ ఎంఎల్‌హెచ్‌పీ డిప్యుటేషన్‌పై ఎంజీఎంకు వచ్చి ఆశలు, ఏఎన్‌ఎంలు, రోగులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించా రు. తక్షణమే ఆమె డిప్యుటేషన్ రద్దుచేసి వెంటనే యథాస్థానానికి పంపించాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఎంహెచ్‌ఓకు వినతిపత్రం అందజేశారు. యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సుధాకర్, యూ ఎఫ్‌డబ్ల్యూసీ సిబ్బంది ప్రేమలత, రాజ సులోచన, కోమల, అనిత, పద్మ, కవిత, సంధ్య, నాజియా, రాణి, గౌసియా, నాగమణి పాల్గొన్నారు.