
వినతులపై దృష్టి పెట్టండి
వరంగల్ అర్బన్: గ్రీవెన్స్‌లో ప్రజలు ఇచ్చిన వినతులపై ఆయా విభాగాల అధికారులు, సిబ్బంది వెంటనే స్పందించి పరిష్కారం చూపాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్ సెల్‌లో కమిషనర్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈసందర్భంగా వ్యక్తిగత, కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని పలువురు విజ్ఞప్తి చేశారు. టౌన్ ప్లానింగ్ విభాగానికి–33, ఇంజనీరింగ్ సెక్షన్–21, ప్రజారోగ్యం, శానిటేషన్–7, పన్నుల సెక్షన్–9, నీటి సరఫరా–4, ఉద్యాన వన సెక్షన్‌కు ఒక ఫిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో సీఏంహెచ్‌ఓ రాజారెడ్డి , డీఎఫ్‌ఓ శంకర్ లింగం, సీహెచ్‌ఓ రమేశ్ తదితర అధికారులు పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని..
● హనుమకొండ జూ పార్కుకు ఎదురుగా ఉన్న రోడ్డులో, బాలసముద్రం శ్రీనివాస్ కాలనీలో, 55వ డివిజన్ భీమారం అలకనంద కాలనీ రోడ్డుకు గుంతలు పడిందని, డ్రెయినేజీ నిర్మించాలని అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, స్థానికులు కోరారు.
● పలివేల్పులలోని వసంత విహార్ హౌజ్ బోర్డు పార్కు ఖాళీ స్థలానికి ప్రహరీ నిర్మించి కాపాడాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.
● 50వ డివిజన్ బృందావన కాలనీలో సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మాణానికి ఇంజనీర్లు ప్రతిపాదనలు సిద్ధం చేశారని, మంజూరు చేయాలని శ్రీనివాస్ రెడ్డి కోరారు.
● 55వ డివిజన్ సాయినగర్ కాలనీ దేవన్నపేట రోడ్డులో తాగునీటి పైపులైన్లు ఏర్పాటు చేసి నల్లా కనెక్షన్లు మంజూరు చేయాలని అభివృద్ధి కమిటీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.
● హనుమకొండ పరిమళ కాలనీలో పైపులైన్ల లీకేజీతో తాగునీరు వృథాగా పోతోందని అరికట్టాలని సత్యనారాయణరెడ్డి, 42వ డివిజన్ పెరుకవాడ ప్రాంతంలో నల్లా నీరు రావడం లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు.
● భద్రకాళి చెరువు మత్తడి నుంచి రాయపుర వెళ్లే డ్రెయినేజీ 5, 6 ఫీట్లలో మట్టి పేరుకుపోయిందని తొలగించాలని స్థానికులు వినతిపత్రం అందజేశారు.
● 28వ డివిజన్ ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు ఎదురుగా శిథిలావస్థకు చేరిన భవనాన్ని కూ ల్చేసి, ప్రమాదం జరుగకుండా చర్యలు తీసుకో వాలని వ్యాపారులు దరఖాస్తు సమర్పించారు.
● నగరంలో బల్దియా, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతానికి గురవుతున్నాయని చర్యలు తీసుకోవాలని పెరుమాండ్ల లక్ష్మణ్ కోరారు.
● 14వ డివిజన్ ఎన్‌టీఆర్ నగర్‌లో వీధిలైట్లు వెలగడం లేదని స్థానికులు వినతి సమర్పించారు.
● 3వ డివిజన్ సత్యనారాయణ కాలనీ–1లో కనీస వసతులు కల్పించాలని అభివృద్ధి కమిటీ ప్రతినిధులు కోరారు.
● 57వ డివిజన్ గోకుల్‌నగర్‌లో నాలాపై ఆక్రమ నిర్మాణం చేస్తున్నారని చర్యలు తీసుకోవాలని స్థానికులు ఫిర్యాదు చేశారు.
● ప్రకాశ్‌రెడ్డి పేట 24–3–201/1 వద్ద 80 ఫీట్ల రోడ్డును ఆక్రమించి నిర్మాణం చేస్తున్నారని చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు వినతిపత్రం అందజేశారు.
● 1వ డివిజన్ గుండ్లసింగారంలో ప్రైవేట్ హాస్టల్స్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యర్థాలను డ్రెయినేజీ వేస్తుండటంతో మురుగునీరు ముందుకు పోవడం లేదని, దుర్గంధం వెదజల్లుతుందని చర్యలు చేపట్టాలని భద్రకాళి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు విన్నవించారు.
అధికారులను ఆదేశించిన బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్
బల్దియా గ్రీవెన్స్‌కు 75 ఫిర్యాదులు

వినతులపై దృష్టి పెట్టండి

వినతులపై దృష్టి పెట్టండి