
పరిష్కారంలో జాప్యం చేయొద్దు
హన్మకొండ అర్బన్ : ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం చేయవద్దని హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డిని అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో డీఆర్‌ఓ వైవీ. గణేశ్‌తో కలిసి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆయా శాఖల అధికారులు వినతుల పరిష్కారంలో జాప్యం చేయొద్దని సూచించారు. ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించిన మొత్తం 157 వినతులు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మేన శ్రీను, సీపీఓ సత్యనారాయణరెడ్డి, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, నారాయణ, వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.
సీనియర్ సిటిజన్స్ సేవలు అభినందనీయం:
డీడబ్ల్యూఓ జయంతి
కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్‌లో పేదలకు, నిరక్షరాస్యులకు స్వచ్ఛందంగా దరఖాస్తులు రాసిపెట్టే సీనియర్ సిటిజన్స్ సేవలు అభినందనీయమని హనుమకొండ సంక్షేమ శాఖ అధికారి జయంతి కొనియాడారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రతీ సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే గ్రామీణుల నుంచి కొందరు ఎక్కువ మొత్తంలో నగదు వసూలు చేస్తుండడాన్ని గమనించి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసి సేవలందిస్తున్నారు. ఈ మేరకు సోమవారంతో ఈస్వచ్ఛంద సేవలు మొదలుపెట్టి సంవత్సరం గడిచిన సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి జయంతి హెల్ప్ డెస్క్ సందర్శించి వారిని అభినందించారు. కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి తేరాల యుగంధర్, కార్యవర్గ సభ్యులు మార్క రవీందర్‌గౌడ్, గుంటి సీతారాములు, జి.శ్రీనివాస్, శీలం వెంకటేశ్వర్లు, టి.శివాజీ, చిదురాల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
వినతులు పరిష్కరించరూ..
వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి
న్యూశాయంపేట: డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పించాలని ఒకరు, భూమిని కబ్జా చేశారని ఇంకొకరు, పట్టాదారు పాస్ బుక్ అందించాలని మరొకరు.. ఇలా జిల్లా వ్యాప్తంగా పలువురు బాధితులు తమ సమస్యలను అధికారులకు విన్నవించారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో జిల్లా అధికారులతో కలిసి అదనపు కలెక్టర్ సంధ్యారాణి వినతులు స్వీకరించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని, పెండింగ్ దరఖాస్తులు లేకుండా చూడాలన్నారు. పరిష్కరించలేని వినతులు దరఖాస్తుదారుడికి అర్థమయ్యేలా చెప్పాలన్నారు.
అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి

పరిష్కారంలో జాప్యం చేయొద్దు