
మరిన్ని హంగులతో ఏర్పాట్లు
మేయర్ గుండు సుధారాణి
ఖిలా వరంగల్ : చరిత్రలో నిలిచేలా సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తామని నగర మేయర్ గుండు సుధారాణి పేర్కొన్నారు. కరీమాబాద్ ఉర్సు రంగలీల మైదానంలో సద్దుల బతుకమ్మ, దసరా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేయాలని కోరుతూ ఉత్సవ కమిటీ నాయకులు సోమవారం మేయర్ సుధారాణికి వినతిపత్రం అందజేశారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ.. గతంలో కంటే ఈ ఏడాది మరిన్ని హంగులతో ఏర్పాట్లు చేస్తామని, వేడుకులను వీక్షించే ప్రజలకు తగిన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. రంగలీల మైదానం జిగేల్‌మనేలా విద్యుత్ దీపాలను ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నాగపురి సంజయ్‌బాబు, కార్యదర్శి మేడిది మధుసూదన్, కోశాధికారి మండ వెంకన్న, ట్రస్ట్ చైర్మన్ వంగరి కోటేశ్వర్, ఉపాధ్యక్షుడు గోనె రాంప్రసాద్, ప్రతినిధులు పాల్గొన్నారు.