
రైల్వే గార్డుల సమస్యలు పరిష్కరించాలి
కాజీపేట రూరల్: రైల్వే గార్డు (ట్రైన్ మేనేజర్)ల సమస్యలు పరిష్కరించాలని ఆల్ ఇండియా గార్డ్స్ కౌన్సిల్ (ఏఐజీసీ) ఫార్మర్ జనరల్ సెక్రటరీలు ఎస్పీ సింగ్, డీఎన్‌ఎస్‌ఎస్ రావు అన్నారు. కాజీపేట రైల్వే కమ్యూనిటీ హాల్‌లో శనివారం సికింద్రాబాద్ డివిజన్ సెక్రటరీ కట్కూరి ప్రవీణ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. అధిక పనిగంటల ఒత్తిడితో రైల్వే గార్డులు అనారోగ్యం పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణ మధ్య రైల్వే జోనల్ ఏఐజీసీ అధ్యక్ష, కార్యదర్శులు అఖిలేశ్‌పాండే, రత్నేశ్‌కుమార్ మాట్లాడుతూ గార్డులకు సదుపాయాలు మెరుగుపర్చాలని సూచించారు. సికింద్రాబాద్ డివిజన్ సెక్రటరీ కె.ప్రవీణ్, సికింద్రాబాద్ అన్ని రైల్వే డిపోల నుంచి సుమారు 200 మంది ట్రైయిన్ మేనేజర్లు పాల్గొన్నారు.