
డిగ్రీ సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లించాలి
కేయూ క్యాంపస్: కేయూ పరిధి డిగ్రీ బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ తదితర కోర్సుల మొదటి, మూడో, ఐదో సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లించేందుకు శుక్రవారం ఫీజు నోటిఫికేషన్‌ను శుక్రవారం వర్సిటీ అధికారులు తెలిపారు. అపరాధ రుసుం లేకుండా విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు అక్టోబర్ 15 వరకు గడువు ఉందని, రూ.50 అపరాధ రుసుంతో అక్టోబర్ 22 వరకు గడువు ఉందని తెలిపారు. పూర్తి వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కాకతీయ.ఏసీ.ఇన్‌లో చూడాలని అదనపు పరీక్షల నియంత్రణాధికారులు డాక్టర్ తిరుమలాదేవి, డాక్టర్ పి.వెంకటయ్య తెలిపారు.
అంతర్జాతీయ సదస్సుకు సుమన్
కేయూ క్యాంపస్: మలేషియాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ మరాలో ఈనెల 18 నుంచి ప్రారంభమై 20 వరకు నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సులో కాకతీయ యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల పరిశోధకుడు నమిలే సుమన్ పాల్గొంటున్నారు. ఈసదస్సులో ‘ఎఫెక్ట్ ఆఫ్ మెథడ్స్ ఆన్‌ట్రైబల్ అండ్ నాన్‌ట్రైబల్ యూనివర్సిటీ అథ్లెటిక్స్’ అంశంపై ఆయన తన పరిశోధన పత్రాన్ని సమర్పించనున్నారు. నమిలే సుమన్ కేయూలోనే బీపీఈడీ, ఎంపీఈడీ పూర్తి చేసి ప్రస్తుతం రీసెర్చ్ స్కాలర్‌గా ఉన్నారు. అథ్లెటిక్స్‌లో ఇప్పటికే విశేష ప్రతిభను కనబర్చారు. పలు మెడల్స్ కూడా సాధించారు.

డిగ్రీ సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లించాలి