
మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన
కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో శుక్రవారం ఆ కళాశాల ప్లేస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించినన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ జాబ్‌మేళా సందర్భంగా ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశంలో ప్రిన్సిపాల్ ఆచార్య జ్యోతి మాట్లాడుతూ.. ఈ జాబ్ మేళాలో 16 కంపెనీలు పాల్గొన్నట్లు తెలిపారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని సూచించారు. కళాశాలలో ప్రతి నెలా జాబ్ మేళా నిర్వహించేలా చర్యలు చేపడతామన్నారు. ఇకముందు వివిధ సంస్థలతో ఎంఓయూ కుదుర్చుకొని విద్యార్థులకు ఉత్తమ భవిష్యత్ అందించేదిశగా కృషిచేస్తామన్నారు. కాలేజీ ప్లేస్‌మెంట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ జితేందర్, వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్, అధ్యాపకులు వరలక్ష్మి, పీ.సరిత, ప్రవీణ్, ఎ.సరిత పాల్గొన్నారు. డిగ్రీ కోర్సులతోపాటుగా బీటెక్, ఫార్మసీ విద్యార్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు.