
విద్యుదాఘాతంతో కాంగ్రెస్ యూత్ నాయకుడి మృతి
రాయపర్తి/ ఖిలావరంగల్: వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని ఏకే తండాకు చెందిన కాంగ్రెస్ యూత్ నాయకుడు మూడ్ వినోద్(25) విద్యుదాఘాతంతో మృతిచెందాడు. తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన వినోద్ వరంగల్ పట్టణం కరీంబాద్‌లోని ఉర్సు గుట్ట సమీపంలో విద్యుత్ సరఫరా మరమ్మతులు చేపడుతుండగా ప్రమాదవశాత్తు కరెంటు షాక్‌కు గురయ్యాడు. చికిత్స నిమిత్తం నగరంలోని మెడికేర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. వినోద్ మృతి సమాచారం తెలుసుకున్న కాంగ్రెస్ తొర్రూరు బ్లాక్ అధ్యక్షుడు జాటోత్ హామ్యా నాయక్, రాయపర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బొమ్మర కల్యాణ్‌గౌడ్, మండల పార్టీ నాయకులు బాధ్య నాయక్, సోమనాయక్ తదితరులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.