సర్కార్‌ బడి @ 75 | - | Sakshi
Sakshi News home page

సర్కార్‌ బడి @ 75

Sep 20 2025 6:48 AM | Updated on Sep 20 2025 6:48 AM

సర్కా

సర్కార్‌ బడి @ 75

బడిబాటతో వందలాదిమంది చేరిక

ఖిలా వరంగల్‌: వేలాదిమంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి ఉన్నతంగా తీర్చిదిద్దిన వరంగల్‌ నగరంలోని కరీమాబాద్‌ ఉన్నత పాఠశాల ప్రారంభించి 75 ఏళ్లు పూర్తయింది. 1950లో ఉర్దూ ప్రాథమిక పాఠశాలగా ప్రారంభించిన ఈ బడి ఏడాది తిరగక ముందే పాథమికోన్నత పాఠశాలగా మార్పు చేసి ఉర్దూతోపాటు తెలుగులోనూ బోధన ఆరంభించారు. ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు దేశ విదేశాల్లో స్థిరపడ్డారు. 2025 జూన్‌ 11 నాటికి 74 వసంతాలు పూర్తి చేసుకొని 75వ వసంతంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో ప్రధానోపాధ్యాయురాలు రావూరి మాధవి ఆధ్వర్యంలో పాఠశాల ప్రాంగణంలో వనమహోత్సవాన్ని నిర్వహించి విరివిగా మొక్కలు నాటి ఆదర్శంగా నిలిచారు.

సకల వసతులు..

విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా హెచ్‌ మాధవి చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం ఉన్నత పాఠశాలలో 472 మంది చదువుతుండగా.. ప్రైవేట్‌ కు ధీటుగా అధునాతన సౌకర్యాలు, 16 మంది ఉ పాధ్యాయులు, తొమ్మిది మంది నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ ఉన్నారు. ప్రాథమిక పాఠశాలలో 269 మంది వి ద్యార్థులు చదువుతుండగా 8 మంది ఉపాధ్యాయులు ఎనిమిది తరగతి గదుల్లో చక్కటి విద్యను అంది స్తున్నారు. ఒకే ప్రాంణంలో నిర్వహిస్తోన్న ప్రాథమి క, ఉన్నత పాఠశాలల్లో మొత్తం 741 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుండగా.. ప్రతితరగతి గది తోపాటు పాఠశాల ప్రాంగణంలో సీసీ కెమెరాలు డి జిటల్‌ విధానంలో బోధన అందిస్తున్నారు. 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు తెలు గు, ఆంగ్ల మాధ్యమంలో బోధన కొనసాగుతోంది. టెన్త్‌ ఫలితాల్లో జిల్లాస్థాయి ర్యాంక్‌ సాధించి విద్యాశాఖ అధికారులతో ప్రశంసలు అందుకున్నారు. దీంతోపాటు ఆకుకూరలు, పప్పులతో కూడిన మధ్యాహ్న భోజనం.. వారానికి మూడు రోజులు కోడి గుడ్లు, ఉదయం రాగిజావ అందజేస్తున్నారు.

సౌకర్యాలు ఇలా...

పాఠశాలలో విశాలమైన మైదానం, ప్రయోగశాలలు, డిజిటల్‌ తరగతుల ద్వారా విద్యాబోధన జరుగుతుంది. విద్యార్థులకు వ్యాయామం, క్రీడాపోటీల్లో తర్పిదినిస్తున్నారు. ఇటీవల ఎస్‌జీఎఫ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో కబడ్డీలో వర్షిత, కళావాస్తవ త్రీడి ఆర్ట్స్‌లో అక్షయ్‌ రాణించి రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు ఎంపికయ్యారు. పది తరగతి గదులు, ల్యాబ్‌, లైబ్రరీ, స్పోర్ట్స్‌, ప్రత్యేక కంప్యూటర్‌ గది ఉన్నాయి. డిజిటల్‌ విధానంలో పాఠాలు బోధిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థల నేతృత్వంలో ఉచితంగా నోట్‌ బుక్కులు, పెన్నులు, బ్యాగులు, సైకిళ్లు అందజేయడంతో దూరప్రాంతాలకు చెందిన విద్యార్థులు సైతం పాఠశాల చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ప్రైవేట్‌కు దీటుగా డిజిటల్‌ బోధన

ఒకే ప్రాంగణంలో ప్రాథమిక,

ఉన్నత పాఠశాలలు

ప్రస్తుతం 741 మంది విద్యార్థులు

సీసీ కెమెరాల పర్యవేక్షణలో

తరగతి గదులు, ప్రాంగణం

ప్రైవేట్‌కు ధీటుగా కొనసాగుతోన్న ఈ పాఠశాలలో క్రమశిక్షణతో కూడిన విద్యనందిస్తోన్నారు. ప్రధానోపాధ్యాయురాలు మాధవి బాధ్యతలు చేపట్టిననాటి నుంచి భవితకు బాటలు వేస్తున్నారు. బడిబాట వంటి కార్యక్రమాల ద్వారా వందలాది మంది విద్యార్థులను పాఠశాలలో చేర్పించారు. పిల్లలు ఆహ్లాదకర వాతావరణంలో ఆంగ్ల మాధ్యమంలో ఆనందంగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలంటే కరీమాబాద్‌ పాఠశాలలోనే చేర్పించాలని తల్లిదండ్రులకు ఆలోచించే స్థాయిలో ఈపాఠశాల నిర్వహణ, బోధన ఉండేలా హెచ్‌ఎం చర్యలు చేపడుతున్నారు.

డైమండ్‌ జూబ్లీకి చేరిన కరీమాబాద్‌ ప్రభుత్వ పాఠశాల

సర్కార్‌ బడి @ 751
1/2

సర్కార్‌ బడి @ 75

సర్కార్‌ బడి @ 752
2/2

సర్కార్‌ బడి @ 75

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement